HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం హైదరాబాద్ కలెక్టరేట్‌ను ముట్టడించింది. పథకాన్ని పాత విధానంలో కొనసాగించాలని, 10 వేల ర్యాంక్ నిబంధనను తొలగించాలని కోరారు. ఆగస్టు 15లోగా రూ.10 వేల కోట్ల బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులతో కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
వార్తలు
రీయింబర్స్‌మెంట్ విడుదలకు డిమాండ్


