ADB: వర్షాకాలంలో లభించే బోడ కాకరకాయలకు ఇచ్చోడ మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. అరుదుగా దొరుకుతుండడంతో ధరలు భారీగా పెరిగి కిలో రూ.230 వరకు పలుకుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో లభించే ఈ కూరగాయలను ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. గతంలో విస్తారంగా లభించిన బోడ కాకరకాయలు ప్రస్తుతం తగ్గిపోవడంతో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని వినియోగదారులు తెలిపారు.
వార్తలు
ఇచ్చోడలో కేజీ బోడ కాకరకాయ రూ. 230


