హైదరాబాద్: 28°C
వార్తలు

క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్లాలి: మంత్రి దుర్గేష్

E.G: రాజమహేంద్రవరం శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల్లో జరుగుతున్న సీబీఎస్ఈ సౌత్ జోన్-1 గర్ల్స్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026కు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారిణులకు సూచించారు.