హైదరాబాద్: 28°C
వార్తలు

'వైసీపీవి నిరాధార ఆరోపణలు'

NLR: డీఎస్సీ నియామకాలు పూర్తయి 14 నెలల తర్వాత అవకతవకలంటూ వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని టీడీపీ నేత చేజర్ల వేంకటేశ్వర రెడ్డి విమర్శించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. హైకోర్టు రెండుసార్లు PIL కొట్టివేసిందని, నిజమైన బాధితులు ఎవరూ లేరని తెలిపారు. కూటమి ప్రభుత్వం 148 రోజుల్లో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించిందన్నారు.