హైదరాబాద్: 28°C
వార్తలు

నిలిచిన నీరు.. స్పందించిన మున్సిపాలిటీ

KDP: బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డులో హెచ్‌పీ గ్యాస్ సమీపంలో భారీ వర్షాలకు నిలిచిన నీటిని మున్సిపల్ అధికారులు తొలగించారు. కమిషనర్ ఎం.కృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించి జేసీబీ సహాయంతో మట్టిని తొలగించి నీటిని కాలువలోకి మళ్లించారు. దీంతో రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ అప్రమత్తంగా పనిచేస్తోందని కమిషనర్ తెలిపారు.