హైదరాబాద్: 28°C
వార్తలు

'మెరుగైన వైద్య సేవలు అందించాలి'

SKLM: కోటబొమ్మలి మండలం తిలారులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం మౌలిక వసతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.