హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రోన్లతో వెదజల్లిన చింత విత్తనాలు

ASR: లోతుగడ్డ సెక్షన్ పరిధిలో అటవీ పునరుద్ధరణకు అటవీశాఖ డ్రోన్ సాంకేతికతతో 4వేల చింత విత్తనాలను వెదజల్లింది. లోతుగడ్డ, చెరుకుంపాకల అటవీ ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి ప్రశాంతి కుమారి పాల్గొన్నారు. మానవులు చేరుకోలేని ప్రాంతాల్లో సైతం విత్తనాలు చల్లడం ద్వారా అటవీ విస్తరణ జరుగుతుందని రేంజర్ తెలిపారు.