హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్

తమిళనాడు సీఎం విజయ్, సంగీత విడాకుల కేసు విచారణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈరోజు కోర్టు విచారణకు సంగీత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని విజయ్ తరపు న్యాయవాది కోరారు. కానీ, ఇవాళే విచారణ జరపాలని సంగీత న్యాయమూర్తిని అభ్యర్థించారు. దీంతో కోర్టు విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.