హైదరాబాద్: 28°C
వార్తలు

'వాన నీటికి సంరక్షణ చర్యలు చేపట్టాలి'

AKP: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వీ.రమణ రైతులకు సూచించారు. చింతపల్లిలో ఉద్యాన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వర్షం నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.