హైదరాబాద్: 28°C
వార్తలు

' దివ్యాంగుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి'

NLG: తెలంగాణలో బధిర (చెవిటి, మూగ), దృష్టిలోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీసీ చైతన్య విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నగేష్ సూర్యవంశం డిమాండ్ చేశారు. ఈ మేరకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసి, సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ప్రత్యేక కళాశాలతో పాటు అదనపు సెక్షన్లు, హాస్టల్ సౌకర్యం కల్పించాలని కోరారు.