హైదరాబాద్: 28°C
వార్తలు

'దాబుగుడలో సబ్ డిపో ఏర్పాటు చేయాలి'

ASR: అరకు మండలం దాబుగుడ, రక్తకండి, దోమలజోరు, తుంగగెడ్డ, కమలతోట గ్రామాలకు సబ్ రేషన్ డిపో మంజూరు చేయాలని గిరిజన సంఘం నేతలు రమేష్, బుజ్జిబాబు, ప్రసాద్ కోరారు. శుక్రవారం MRO శ్రీధర్ రాజ్‌కు వినతి అందజేశారు. 800 మంది జనాభా, 150కుపైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నప్పటికీ రేషన్ డిపో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దాబుగుడలో సబ్ డిపో ఏర్పాటు చేయాలన్నారు.