AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఒక టిప్పర్ లారీ డ్రైవర్ చేసిన నిర్వాకంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పలువురు వాహనదారులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఇరుక్కుపోయారు. వాహనదారులు చేస్తున్న సౌండ్ హారన్స్, అరుపులు కేకలతో దద్దరిల్లింది.
వార్తలు
VIDEO: భారీగా ట్రాఫిక్.. ప్రయాణికులకు ఇబ్బందులు..!


