హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్షాల తీరుపై మోదీ ఆగ్రహం

పార్లమెంట్‌లో విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేపదే సభను అడ్డుకోవడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సజావుగా సభను నడిపేందుకు ప్రతిపక్షాలతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా వారు ఏమాత్రం వినడం లేదని, వారి ప్రవర్తన ఏమాత్రం సహేతుకంగా లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.