హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే సభకు రావాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన లాఠీఛార్జ్, అయోధ్య విరాళాల చోరీ ఘటనలపై అమిత్ షా సమాధానాలు చెప్పాలని పట్టుబడుతూ విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.