హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలల్లో బయోమెట్రిక్.. సుప్రీంలో పిల్‌ తిరస్కరణ

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యానికి(పిల్) చుక్కెదురైంది. ఈ పిల్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. విద్యార్థుల అటెండెన్స్‌కు సంబంధించిన ఈ అంశంపై ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని పిల్ దాఖలు చేసిన న్యాయవాది గోస్వామికి సుప్రీంకోర్టు సూచించింది.