హైదరాబాద్: 28°C
వార్తలు

నల్లబ్యాడ్జీలతో నిరసన.. విధులకు హాజరైన ఉపాధ్యాయులు

JN: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు జనగాం మండలం చీటకోడూరు ఎంపీయూపీఎస్ ఉపాధ్యాయులు శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని సంఘాల నాయకులు స్పష్టం చేశారు.