హైదరాబాద్: 28°C
వార్తలు

"స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి"

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులకు దిశనిర్దేశం చేశారు.