అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ కొడముంజ బాలరాజు ఆధ్వర్యంలో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు నీరు నిలిచే అవకాశం ఉండటంతో గ్రామంలోని డ్రైనేజీలను ఊరి బయట వరకు పూర్తిగా క్లీన్ చేయించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
డ్రైనేజీల శుభ్రతకు సర్పంచ్ చర్యలు


