హైదరాబాద్: 28°C
వార్తలు

పుదుచ్చేరిలో కుండపోత వర్షాలు.. ఇద్దరు మృతి

పుదుచ్చేరిలో కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రహరీ గోడ కూలిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సీఎం రంగస్వామి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.