హైదరాబాద్: 28°C
వార్తలు

నెం.1గా ఏదులాపురం తీర్చిదిద్దుతాం: మంత్రి

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. మార్నింగ్ వాక్ సందర్భంగా సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో నెం.1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు పార్కుల అభివృద్ధి చేస్తున్నామన్నారు.