హైదరాబాద్: 28°C
వార్తలు

సర్కార్ దిగిరాకుంటే తీవ్ర ఆందోళన!

రాంచీలో(జార్ఖండ్) నిరుద్యోగ విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. జేపీఎస్సీ, జేఎస్ఎస్పీ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వర్షంలోనూ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని కోరుతున్న విద్యార్థులు.. ప్రభుత్వంతో పారదర్శక చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.