AP: విజయవాడలో మున్సిపల్ కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు నోటీసు ఇచ్చారు. రూ.350 కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి నారాయణకు కాంట్రాక్టర్లు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
వార్తలు
మున్సిపల్ కాంట్రాక్టర్ల సమ్మె బాట


