హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎర్రగుడిలో మంత్రి పర్యటన

NDL: నేడు బనగానపల్లె మండలం ఎర్రగుడి గ్రామంలో రోడ్లకు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు శుక్రవారం ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు ఎర్రగుడి గ్రామంలో నిర్వహించే ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.