NZB: నిజామాబాద్ 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు తనిఖీల్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. రెండు కేసుల్లో మొత్తం 51 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఐదో ఠాణా ఎస్సై డి. సునీల్ తెలిపారు.
వార్తలు
భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత..


