హైదరాబాద్: 28°C
వార్తలు

'త్వరగా వినియోగంలోకి తీసుకురండి'

MNCL: క్యాతనపల్లి పుర పరిధిలోని ఆర్కే సీవోఏ క్లబ్ పక్కన రూ. 9.5 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో సమీకృత మార్కెట్ భవనాన్ని చేపట్టారు. కొన్నేళ్లుగా పనులు నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా పిచ్చిమొక్కలు పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చెట్ల పొదలు తొలగించి, భన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.