హైదరాబాద్: 28°C
వార్తలు

ఆచూకీ లేని మురుగు కాలువ

ASK: బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డు పక్కనున్న కాపువాడ కాలనీలోని మురుగు కాలువ పూడికతో నిండి ఆనవాళ్లు లేకుండా మారింది. రోడ్డుకు సమానంగా మారింది. దీంతో వర్షం నీటితోపాటు మురుగు రోడ్డుపై పారుతోంది. పూడిక తీయాలని సంబంధిత అధికారులకు విన్నవించినా.. పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. గుంతలకు మరమ్మతులు చేయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.