హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఏటీఎఫ్‌లో ఇథనాల్ కలపడం లేదు’

విమాన ఇంధనంలో(ATF) ఇథనాల్‌ కలిపే ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. ATFలో ఇథనాల్‌ కలుపుతున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తప్పుడు సమాచారంతో ప్రయాణికుల్లో ఆందోళన రేపొద్దని హితవు పలికారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని.. SAF, ఇథనాల్‌ రెండూ వేర్వేరని మంత్రి వివరించారు.