AP: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులతో చర్చించారు. ఎన్నికలపై ఎప్పుడైనా ప్రకటన రావొచ్చని, రెడీగా ఉండాలన్నారు. 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉండగా 23 చోట్ల, 13,359 పంచాయతీలకుగానూ 354 చోట్ల కోర్టు కేసులు ఉన్నాయని తెలిపారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్యాలట్ లేదా EVMలు వినియోగించాలా అనేదానిపైనా చర్చించారు.
వార్తలు
స్థానిక ఎన్నికలపై SEC కీలక అప్‌డేట్


