హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గంజాయి విక్రయం.. ముగ్గురు అరెస్ట్

WNP: కొత్తకోట మండలం కానాయపల్లి సమీపంలో గంజాయి విక్రయం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎస్సై విక్రం నేతృత్వంలో పోలీసు బృందం చేపట్టిన దాడిలో గంజాయి విక్రయిస్తున్న వనపర్తికి చెందిన బంగారు భరత్ కుమార్(39), గంజాయి కొనుగోలు చేస్తున్న కానాయపల్లికి చెందిన పవన్(25), ఇనుపునూరి గణేష్(25)లను అదుపులోకి తీకున్నారు.