SRPT: మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై ఆవులు, దూడలు సంచరిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా నిలుస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రమాదాల ముప్పు కూడా పొంచి ఉంది. ఆవుల యజమానులు వెంటనే వాటిని రహదారి నుంచి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
జాతీయ రహదారిపై ఆవుల సంచారం


