హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినోకు ‘PMDS’ చెక్.. రైతులకు అదనపు రాబడి!

PLD: ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్(PMDS) పద్ధతితో ఎల్‌నినో, వర్షాభావాలను ఎదుర్కోవచ్చని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె. అమల కుమారి తెలిపారు. నార్నిపాడులో పొలాలను పరిశీలించిన ఆమె, 30 రకాల విత్తన గుళికల సాగుతో నేల సారం పెరుగుతుందని చెప్పారు. 45 రోజుల్లోనే వచ్చే పశుగ్రాసంతో పాల దిగుబడి, వెన్నశాతం పెరిగి రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు.