హైదరాబాద్: 28°C
వార్తలు

వైరస్ కలకలం.. 22 మంది చిన్నారులు మృతి

గుజరాత్‌లో 'చాందీపూర' వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మరణించినట్లు గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 184 కేసులు నమోదు కాగా, అందులో 35 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరణించిన వారందరూ 15 ఏళ్ల లోపు పిల్లలే కావడం గమనార్హం. ప్రస్తుతం మరో ఏడుగురు చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.