హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలిలో రూ.65 లక్షల సరుకు మాయం!

GNTR: తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ మార్ట్‌లో స్టోర్ మేనేజర్‌గా పనిచేసిన మల్లివాడ అవినాష్‌పై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మార్ట్‌లో నిర్వహించిన ఆడిట్‌లో సుమారు రూ.65 లక్షల విలువైన సరుకు మాయమైనట్లు గుర్తించారు. ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అవినాష్ విధులకు హాజరుకాకుండా పరారీలో ఉన్నట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.