హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ పులి మృతిపై HLC క్లారిటీ

AP: నంద్యాలలోని ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పులి మృతిపై HLC క్షేత్రస్థాయి విచారణ చేపట్టిందని డిప్యూటీ డైరెక్టర్ విగ్నేశ్ అప్పావ్ తెలిపారు. ముళ్లపందిని వేటాడే క్రమంలో ముళ్లు గుచ్చుకుని తీవ్ర గాయాలతోనే ఆడపులి మృతి చెందినట్లు వెల్లడించారు. వేటగాళ్ల హస్తం గానీ, కుట్ర గానీ లేదని స్పష్టం చేశారు. పులి గర్భవతి అని, పిల్లలు కనిపించడం లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.