హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

TG: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సురక్షితంగా బయటపడ్డారు. అయితే స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. హైదరాబాద్ వెళ్తుండగా పంతంగి టోల్‌గేట్ సమీపంలో ప్రమాదం జరిగింది.