హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్యలో వయోవృద్ధులకు ప్రత్యేక దర్శనం

వయోవృద్ధులకు అయోద్య దేవస్థానం ప్రత్యేక దర్శనం కల్పించనుంది. 70 ఏళ్లు దాటిన వారికి.. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే సుగమ దర్శనం పాస్ జారీ చేయనున్నారు. ఐడీ చూపించి ఈ పాస్ పొంది ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. వృద్ధులతో ఒక సహాయకుడికి అనుమతిస్తారు. మూడేళ్లలోపు చిన్నారుల తల్లులకు ప్రత్యేక పాస్ ఇవ్వనున్నారు. పదేళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రులతో ఉచితంగా రాముని దర్శనం కల్పించనున్నారు.