మధ్యశ్రేణికి చెందిన అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని వెల్లడించింది. అన్ని ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్లను విజయవంతంగా అందుకుందని పేర్కొంది.
వార్తలు
అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం


