కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఫోన్ చేసి, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించారు. డిలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ కోరారు. అయితే, ఇప్పటికే ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దాదాపు 50 నిమిషాల పాటు సాగిన వీరి సంభాషణ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
వార్తలు
రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి ఫోన్


