హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రైతులకు యూరియా బుకింగ్ అలర్ట్!

WNP: గోపాల్ పేట మండల పరిధిలోని రైతులకు ఇవాళ ఉదయం 6 గంటలకు రెండు ప్రాంతాల్లో యూరియా బస్తాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నట్లు మండల వ్యవసాయ అధికారి రమేశ్ తెలిపారు. రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా సమయానికి బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ చేసుకున్నవారు ఐడీ, ఆధార్ కార్డు తీసుకెళ్లాలని తెలిపారు. మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.