హైదరాబాద్: 28°C
వార్తలు

రిజర్వేషన్లపై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

రిజర్వేషన్లు శాశ్వతంగా ఉండకూడదని RSS చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లకు సామాజిక వెనుకబాటుతనమే కారణమని, అయితే కొందరు వీటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. రిజర్వేషన్లతో లబ్ధి పొందిన వారు వాటిని వదులుకుంటే, సమాజంలోని అందరికీ అవకాశాలు లభిస్తాయన్నారు. రాజకీయాల వల్లే రిజర్వేషన్లపై అనవసర వివాదాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు.