హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాల కోసం భవిష్యత్తులో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. అలాగే, పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, భద్రతా పరిస్థితులపై ఇరు దేశాల అధినేతలు చర్చించుకున్నారు.