హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినోతో ఎండిన వరి నారు

SKLM: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఇచ్చాపురం నియోజకవర్గంలో నారు మడులు ఎండిపోతున్నాయి. వారం రోజుల క్రితం పచ్చగా ఉన్న పొలాలు ఇప్పుడు నీరు లేక ఎండిపోయాయి. సకాలంలో వర్షాలు లేకపోతే ఖరీఫ్ వరి సాగుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వంశధార కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేసి సాగునీటిని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.