హైదరాబాద్: 28°C
వార్తలు

'గోబర్ధన్' పథకం .. ప్రధాన ఉద్దేశం ఇదే

'గోబర్ధన్' పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించి రూ.23,731 కోట్ల వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2026-27 నుంచి 2035-36 వరకు పదేళ్లు ఇది అమలు కానుంది. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, సేంద్రీయ వ్యర్థాలను ఇంధనంగా, సేంద్రీయ ఎరువులుగా మార్చడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. భారత భవిష్యత్ ఇంధన అవసరాల్లో కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG)ను ఒక ప్రధాన వనరుగా నిలబెట్టేందుకు కేంద్రం ఈ పథకం తీసుకొచ్చింది.