హైదరాబాద్: 28°C
వార్తలు

గంజాయి నివారణపై పోలీసుల అవగాహన కార్యక్రమం

NLR: ఏఎస్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గండువారిపల్లి గ్రామంలో ఎస్సై జిలానీ గురువారం రైతులకు గంజాయి, ఇతర మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు మాట్లాడుతూ.. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయలన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.