హైదరాబాద్: 28°C
వార్తలు

రాజేష్ త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం

కేరళ వరదల్లో చిక్కుకున్న ఓ రైతును రక్షించే క్రమంలో, రెస్క్యూ వాలంటీర్ రాజేష్ తన లైఫ్ జాకెట్‌ను ఆయనకు తొడిగి ప్రాణాలు కాపాడాడు. అయితే, వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాజేష్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించాడు. ఈ ఘటనపై కేరళ CM తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'రాజేష్ చేసిన త్యాగం కేరళ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన చూపిన సాహసం చిరస్మరణీయం' అంటూ భావోద్వేగ పోస్టు చేశారు.