హైదరాబాద్: 28°C
వార్తలు

మత్స్యకారులకు పరికరాల పంపిణీ

ప్రకాశం: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు గురువారం పార్టీ కార్యాలయంలో రూ.35.62 లక్షల విలువైన 13 బోటు ఇంజిన్లు, 87 ట్రాన్స్‌పాండర్లను మత్స్యకారుల కుటుంబాలకు పంపిణీ చేశారు. మత్స్యకారుల భద్రత, జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మత్స్యకారులకు సూచించారు.