ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. AAP, CPM ఎంపీలు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గతేడాది మోదీ విదేశీ ప్రయాణాల కోసం రూ.187 కోట్లు ఖర్చయినట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది జూలై నాటికి రూ.74 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఈ పర్యటనలతో ఆయా దేశాలతో భారత సంబందాల బలోపేతమైనట్లు ఆమె తెలిపారు.
వార్తలు
మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.187 కోట్లు


