హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షాతో TMC రెబల్ ముస్లిం ఎంపీలు భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ముస్లిం ఎంపీలు కలిశారు. తమ సొంత నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నామని, రక్షణ కల్పించాలని హోంమంత్రికి వారు వినతిపత్రం సమర్పించారు. మసీదుల వద్ద మైకులు తొలగించే చర్యలు నిబంధనలకు లోబడి మాత్రమే జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా వారికి హామీ ఇచ్చారు.