హైదరాబాద్: 28°C
వార్తలు

'లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించాలి'

ప్రకాశం: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని గిద్దలూరు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కే. భరత్ చంద్ర పోలీసు అధికారులను కోరారు. రాజీ ద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని, రాజీకి అనువైన కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు.