హైదరాబాద్: 28°C
వార్తలు

ఫత్వా ఆధారంగా వివాహ రద్దు చెల్లదు: హైకోర్టు 

వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలకు లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫత్వా ఆధారంగా వివాహ బంధం రద్దయినట్లు పరిగణించలేమని తెలిపింది. చట్టబద్ధంగా కోర్టుల ద్వారానే విడాకులు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వివాహ రద్దుపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కోర్టులకే ఉంటుందని వెల్లడించింది.